Motorola Edge 70 Pro Plus : మోటోరోలా లవర్స్ మీకోసమే.. ఈ కొత్త మోటోరోలా 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 70 Pro Plus First Sale : గత వారమే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మార్కెట్లోకి రాగా ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 11న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ మోటోరోలా ఫోన్ కొనుగోలుపై రూ. 5250 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు.

Motorola Edge 70 Pro Plus First Sale : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ సేల్ జూన్ 11న ప్రారంభమైంది. ఈ మోటోరోలా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. పవర్ఫుల్ 6500mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌పై రూ. 5,250 వరకు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ కొనుగోలుపై మరింత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ మోటోరోలా ప్లస్ వేరియంట్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే? :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ వేరియంట్ ధర రూ. 47,999గా ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే.. రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో చెల్లిస్తే రూ. 5,250 తగ్గింపు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ కార్డుతో చెల్లిస్తే రూ. 2,400 తగ్గింపు పొందవచ్చు. ఈ ధరలో నథింగ్ ఫోన్ (4a)ప్రో, ఒప్పో రెనో14 5జీ, గూగుల్ పిక్సెల్ 10a వంటి స్మార్ట్ఫోన్లు కూడా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత హేలో యూఐపై రన్ అవుతుంది. ఈ మోటోరోలా ఫోన్ 6.8-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 5200 నిట్స్ టాప్ బ్రైట్నెస్, HDR10+,144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్లో కూలింగ్ కోసం వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. AnTuTu స్కోర్ 24 లక్షలు ఉంటుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP సోనీ LYT710 ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

ఈ మోటోరోలా ఫోన్లో 6500mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5W వైర్డ్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, 5G, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ జీపీఎస్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
