PM Narendra Modi : నెదర్లాండ్స్‌లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఫిదా అయిన ప్రధాని.. ఫొటోలు వైరల్
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఐదు దేశాల పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తొలుత యూఏఈ దేశానికి వెళ్లిన మోదీ ఆ పర్యటన ముగించుకుని శనివారం నెదర్లాండ్ లో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్‌లోని భారతీయ ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం నృత్య ప్రదర్శనలతో పాటు గర్బా ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. దీంతో ప్రధాని మోదీ వారి స్వాగతానికి ఫిదా అయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.












