Irumudi : రవితేజ ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రవితేజ నటించిన ఇరుముడి (Irumudi)చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.
Ravi Teja Irumudi OTT streaming date fix
Irumudi : రవితేజ నటించిన చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చెప్పింది.
Vasavi Ganeshan : చీరలో హుషారు పిట్టలు భామ.. వాసవి గణేషన్ ఫోటోలు వైరల్..
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర, సాయి కుమార్, శ్వాసిక, అజయ్ ఘోష్ లు కీలక పాత్రలను పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలోని భావోద్వేగ అంశాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రవితేజను ఇప్పటివరకు చూడని ఒక కొత్త కోణంలో చూడడం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని పెంచిన అంశాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను కలిపి కథను నడిపించిన విధానం ప్రేక్షకులను మెప్పించినట్లు చిత్ర బృందం చెప్పింది.
