Samsung Galaxy S26 Ultra : లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్.. అమెజాన్‌లో భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 20వేల తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. అత్యంత ఖరీదైన శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పుడు సరసమైన ధరకే లభిస్తోంది. కొత్త ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే మీ కోసం అమెజాన్ అద్భుతమైన డీల్ అందిస్తోంది.

ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇప్పుడు ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 లాంచ్‌కు ముందే ఈ లగ్జరీ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.

అయితే, ఈ అల్ట్రాలో కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, క్వాడ్ కెమెరా సెటప్, కెమెరా డిజైన్ వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంతకీ మీ బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లభిస్తుందా? కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో భారీగా తగ్గిన అల్ట్రా ధర :
శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్ రూ. 1,39,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్‌లో రూ. 1,19,480 ధరకు లభిస్తోంది. ఎలాంటి కార్డులు లేకుండా ఈ కొత్త ఫోన్ రూ. 20వేలకు పైగా సేవ్ చేసుకోవచ్చు.

మీ వద్ద అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం ఈ శాంసంగ్ ఫోన్ రూ. 3,500పైగా ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర నుంచి రూ. 1,16,000 కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 4,201 నుంచి ఈఎంఐతో కొనేసుకోవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ. 38,950 వరకు వాల్యూ పొందవచ్చు. అదనంగా ఎక్స్టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా తీసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొనాలా? :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ మార్కెట్లో దొరికే మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్, వరల్డ్ ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లేతో వస్తుంది. విశాలమైన ఎఫ్/1.4 అపర్చర్‌తో 200MP మెయిన్ కెమెరా, 60W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.

అలాగే, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కూడా ఉంది. 6.9-అంగుళాల భారీ సైజు ఉన్నా ఫోన్ చూసేందుకు చాలా సన్నగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ కొత్త వెర్షన్లో ఎస్ పెన్ బ్లూటూత్ ఆధారిత రిమోట్ జెస్చర్ ఫంక్షనాలిటీ లేదు. ఫ్లాగ్షిప్ ధర వద్ద Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్ అలైన్మెంట్ కూడా ఇందులో లేదు. శాంసంగ్ అల్ట్రా ఫోన్ కొనేముందు ఈ ఫీచర్ల విషయంలో ఆలోచించాల్సిందే..
