Mumbai Indians : వరుస ఓటములు.. ఆటగాళ్లకు పార్టీ ఇచ్చిన ముంబై ఇండియన్స్..! లవర్‌తో హార్దిక్ పాండ్యా.. ఫోటోలు వైరల్
ఆటగాళ్లు మంచి ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians )మేనేజ్మెంట్ ఓ పార్టీని ఏర్పాటు చేసింది.

ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది.

ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -0.736గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.

తమ తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఏప్రిల్ 29న వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ముంబైకి ఐదు రోజుల విరామం దొరికింది.

ఈ క్రమంలో ఆటగాళ్లు మంచి ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఓ పార్టీని ఏర్పాటు చేసింది.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలతో పాటు మిగిలిన ముంబై ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో ముంబై పోస్టు చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఓటములను మరిచిపోయి సరికొత్త ఉత్తేజంతో మైదానంలోకి దిగి విజయాల బాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
