Vivo V50 Price : పండగ చేస్కోండి.. ఈ వివో ఫోన్ మరి ఇంత తక్కువా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలుసా?
Vivo V50 Price : వివో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 7వేలకు పైగా తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Vivo V50 Price : ఈ వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. మిడ్ రేంజ్ ఫోన్లలో 2025లో వచ్చిన వివో V50 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ వివో ఫోన్ అసలు ధర రూ. 39,999 వద్ద లభ్యమవుతోంది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ రూ. 7వేలకుపైగా తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో 6.77-అంగుళాల డిస్ప్లేతో పాటు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ 50MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉన్నాయి. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో V50 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
వివో V50 ఫోన్ రూ. 39,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 32,999కే లభిస్తోంది. ఈ ఫోన్ సేల్ ధరపై రూ. 7వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 1,650 సేవింగ్ చేసుకోవచ్చు.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు కేవలం రూ. 2,750 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. మీ పాత డివైజ్‌ను ట్రేడ్-ఇన్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 23,700 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ, మీ పాత డివైజ్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి వాల్యూ ఉంటుంది.

వివో V50 స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ ఉంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. ఈ వివో ఫోన్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది.

ఈ వివో ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 12GB LPDDR4X ర్యామ్ అందిస్తుంది. వివో V50 ఫోన్లో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా లవర్స్ కోసం వివో వి50 ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో జైస్ (Zeiss) 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

వివో V50 కొనాలా? వద్దా? :
ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరాలతో లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందించే మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే వివో V50 ఫోన్ బెటర్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.
