Vivo X300 Pro Deal : ఏంది భయ్యా ఆఫర్.. వివో X300 ప్రో మరి ఇంత తక్కువకా? అమెజాన్‌లో జస్ట్..!
Vivo X300 Pro Deal : వివోనా మజాకా.. వివో ఎక్స్300 ప్రో డీల్ అద్భుతంగా ఉంది. అమెజాన్‌లో బ్యాంకు ఆఫర్లతో ఏకంగా రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Vivo X300 Pro Deal : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన డీల్.. మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే.. వివో X300 ప్రో చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. వివో X300 ప్రో అసలు ధర రూ. 1,19,999 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 12వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది.

6.78-అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్, 200MP టెలిఫోటో లెన్స్ మరెన్నో ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువరోజులు ఉండవు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో X300 ప్రో డీల్ :
భారత మార్కెట్లో వివో X300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999కు లభిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 12,999 డిస్కౌంట్ పొందవచ్చు.

యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లేకున్నా ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్-ఇన్ చేయవచ్చు.

వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో X300 ప్రోలో 2800 × 1260 (1.5K+) రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే కంటెంట్ బట్టి రిఫ్రెష్ రేట్‌ను 1Hz నుంచి 120Hz మధ్య అడ్జెస్ట్ చేసే ఎల్టీపీఓ ప్యానెల్ ఉన్నాయి. HDR10+, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ HDR, SGS లో-బ్లూ లైట్, TUV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీలకు కూడా సపోర్టు ఇస్తుంది.

వివో X300 ప్రో లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్ అమర్చారు. అంతేకాదు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510 mAh బ్యాటరీ కూడా అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో X300 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, OIS, ఎఫ్/2.67 అపర్చర్‌తో 200MP HPB టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది.
