Vivo X500 Pro Launch : ఫ్లాగ్‌షిప్‌లకు గట్టి పోటీ.. కొత్త వివో X500 ప్రో వస్తోందోచ్.. లీక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
Vivo X500 Pro : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. వివో X500 ప్రోలో మధ్యలో సర్కిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని అంచనా. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Vivo X500 Pro : వివో లవర్స్ మీకోసమే.. వివో నుంచి సరికొత్త ప్రో ఫోన్ రాబోతుంది. వివో X500 ప్రో లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఉంటుందని అంచనా. గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన వివో X300 ప్రో స్థానంలో వివో ఎక్స్500 ప్రో రాబోతుంది.

నివేదికల ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్, డిస్ప్లే వివరాలు రివీల్ అయ్యాయి. వివో X500 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.37-అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంజనీరింగ్ శాంపిల్స్‌ను బీఓఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.

వివో X500 ప్రోలో ఎల్ఐపీఓ డిస్ప్లే ప్యాకేజింగ్‌తో వస్తుందని అంచనా. నాలుగు వైపులా సన్నని బెజెల్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ ఉంటుందని అంచనా. వివో X500 ప్రోలో మధ్యలో సర్కిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని అంచనా. గతంలో వివో ఎక్స్-సిరీస్ స్మార్ట్ఫోన్లలో కెమెరా మాడ్యూల్ ఉండేది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది.

గత ఏడాది డిసెంబర్లో భారత మార్కెట్లో వివో X300 ప్రో లాంచ్ కాగా 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే (1,260 × 2,800 పిక్సెల్స్) అందిస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.

వివో X300 ప్రో బ్యాక్ సైడ్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,510mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
