Diwali 2026: దీపావళి రోజున లక్ష్మీదేవి కటాక్షం కోసం శుభ ముహూర్తాలివే.. నవంబర్ 8నే వృషభ లగ్నం ప్రారంభం.. పంచాంగ వేత్తల స్పష్టత!

2026 దీపావళి (Diwali 2026)పండుగ, ధనలక్ష్మీ పూజలను ఆదివారం రోజే నిర్వహించుకోవాలని వేదపండితులు స్పష్టం చేయగా, ప్రదోష కాలం, వృషభ లగ్న పూజా ముహూర్తాల వివరాలు ఇవే.

Diwali 2026 lakshmi puja shubh muhurat panchangam timings naraka chaturdashi details

Diwali 2026: 2026 సంవత్సరంలో దీపావళి పర్వదినం పట్ల భక్తులలో ఉన్న సందేహాలకు పంచాంగ వేత్తలు స్పష్టతనిచ్చారు. నవంబర్ 8 (ఆదివారం) వేకువజామున అరుణోదయ వేళలో చతుర్దశి తిథి ఉండటంతో పాటు, అదే రోజు ఉదయం 10:30 గంటల తర్వాత అమావాస్య ప్రారంభమై రాత్రి ప్రదోష కాలంలో వ్యాపించి ఉంటుంది. ఈ కారణంతో నరక చతుర్దశి తెల్లవారుజాము అభ్యంగన స్నానాలు, సాయంత్రం వేళ దీపావళి ధనలక్ష్మీ పూజలను ఆదివారం (నవంబర్ 8) రోజే నిర్వహించుకోవడం అత్యంత శాస్త్రోక్తం, శుభప్రదం అని చెప్తున్నారు.

YS Jagan: ఇది ఎన్నిక కాదు.. కుట్ర! ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం!

లక్ష్మీ పూజా శుభ ముహూర్తాలు.. ప్రదోష కాలం, వృషభ లగ్నం:

దీపావళి (Diwali 2026)నాటి సాయంత్రం ప్రదోష కాలంలో ధనలక్ష్మి, కుబేర పూజలు ఆచరించడానికి పండితులు ప్రత్యేక ముహూర్తాలను నిర్దేశించారు. సాయంత్రం 5:24 గంటల నుంచి 7:36 గంటల వరకు ప్రదోష కాల ముహూర్తం ఉండగా, రాత్రి 6:57 గంటల నుంచి 9:47 గంటల మధ్య వృషభ లగ్నం అత్యంత శ్రేష్ఠమైనదిగా పేర్కొన్నారు. స్థిర లగ్నమైన వృషభ లగ్నంలో చేసే పూజ వల్ల ఇళ్లలో మహాలక్ష్మి స్థిరంగా నివాసముంటుందని నమ్ముతారు. అంతేకాకుండా రాత్రి 11:28 నుంచి 12:15 గంటల మధ్య నిశీథ కాలంలో చేసే అర్ధరాత్రి లక్ష్మీ పూజ కూడా విశేష ఫలాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు వెల్లడించారు.

ఆకాశదీపం, కార్తీక మాసారంభం వివరాలు:

ఇక పండుగ మరుసటి రోజున అనగా నవంబర్ 9 (సోమవారం) ఉదయం సూర్యోదయ సమయానికి అమావాస్య తిథి కొనసాగుతుండటంతో ఆ రోజు సాయంత్రం వేళల్లో ఆకాశదీపం వెలిగించడం ఆనవాయితీ. అనంతరం నవంబర్ 10 (మంగళవారం) నుండి పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ పవిత్ర దినాల్లో ఉదయాన్నే దీపారాధనలు చేసి, ప్రదోష వేళలో లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేదపండితులు తెలియజేశారు.