Courtesy @BCCIWomen
AUS Women vs IND Women: ఆస్ట్రేలియా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఉమెన్స్ టీమ్ పోరాడి ఓడింది. 413 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ సెంచరీతో కదం తొక్కారు. స్మృతి 63 బంతుల్లోనే 125 పరుగులు చేశారు. 17 ఫోర్లు, 5 సిక్సులు బాదింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడారు. హాఫ్ సెంచరీతో మెరిశారు. 35 బంతుల్లో 52 రన్స్ చేశారు.
దీప్తి శర్మ అర్థ శతకంతో చెలరేగారు. 58 బంతుల్లో 72 పరుగులు చేశారు. వీరు రాణించినా.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. 43 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. 47 ఓవర్లలో 369 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. 47.5 ఓవర్లలో 412 పరుగులు బాదింది. ఆసీస్ జట్టులో బెత్ మూనీ సెంచరీతో చెలరేగారు. 75 బంతుల్లోనే 138 రన్స్ చేశారు. జార్జియా వోల్ (81), పెర్రీ (68) హాఫ్ సెంచరీలతో మెరిశారు.