Ben stokes : చరిత్ర సృష్టించిన బెన్‌స్టోక్స్.. ఒకే ఒక్క ఇంగ్లాండ్ ఆటగాడు
Ben stokes create history : ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.
![Ben stokes : చరిత్ర సృష్టించిన బెన్‌స్టోక్స్.. ఒకే ఒక్క ఇంగ్లాండ్ ఆటగాడు Ben stokes : చరిత్ర సృష్టించిన బెన్‌స్టోక్స్.. ఒకే ఒక్క ఇంగ్లాండ్ ఆటగాడు](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-6-9.jpg)
Ben stokes
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. వరుస పరాజయాలతో సెమీస్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడమే లక్ష్యముగా ఆడుతోంది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లలతో 108 పరుగులు చేశాడు.
ఈక్రమంలో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన మొదటి ఇంగ్లాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. స్టోక్స్ ఇప్పటి వరకు 97 టెస్టుల్లో 36.41 సగటుతో 6,117 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. 113 వన్డేల్లో 39.89 సగటుతో 3,379 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. 43 టీ20ల్లో 21.66 సగటుతో 585 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలలో కలిపి మొత్తం 10,081 పరుగులు చేశాడు.
Glenn Maxwell : మాక్స్వెల్ డబుల్ సెంచరీ పై మీమ్స్.. వైరల్
200 కు పైగా వికెట్లు
ఇంగ్లాండ్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన బెన్‌స్టోక్స్ 97 టెస్టుల్లో 197 వికెట్లు పడగొట్టారు. ఎనిమిది సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన, నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కాకుండా వన్డేల్లో 112 మ్యాచుల్లో 74 వికెట్లు తీశాడు. 43 టీ20 మ్యాచుల్లో 26 వికెట్లు సాధించాడు. మూడు ఫార్మాట్లలలో కలిపి మొత్తం 297 వికెట్లు పడగొట్టాడు.
Ben Stokes becomes the first England player to score 10,000+ runs and pick 100+ wickets in international cricket. pic.twitter.com/aX1BkWGgRq
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 8, 2023