Cameron Green : చిన్న‌ప్ప‌టి నుంచి కిడ్నీ స‌మ‌స్య‌..12 ఏళ్ల‌కు మించి బ‌త‌క‌నని..

Cameron Green kidney disease : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సంచ‌ల‌న విష‌యాల‌ను చెప్పాడు.

Cameron Green : చిన్న‌ప్ప‌టి నుంచి కిడ్నీ స‌మ‌స్య‌..12 ఏళ్ల‌కు మించి బ‌త‌క‌నని..

Cameron Green kidney disease

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సంచ‌ల‌న విష‌యాల‌ను చెప్పాడు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిపాడు. పాకిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌కు గ్రీన్‌ ఎంపిక కాలేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డు ప‌లు కీల‌క విష‌యాల‌ను చెప్పాడు. తాను త‌ల్లి క‌డుపులో ఉన్న‌ప్పుడే మూత్ర పిండ సంబంధిత స‌మ‌స్య ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించిన‌ట్లు తెలిపాడు.

అయితే ప్రాథ‌మికంగా ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదన్నాడు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయ‌డంతో ఈ విష‌యం తెలిసింద‌న్నారు. కిడ్నీలు సాధార‌ణంగా ఉండాల్సినంత ప‌రిమాణంలో లేవ‌ని డాక్ట‌ర్లు త‌న త‌ల్లిదండ్రుల‌తో చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇది కుటుంబానికి ఓ షాక్ అని అయితే రోజులు గ‌డుస్తున్నాకొద్ది త‌న ఆరోగ్యం మెరుగుప‌డిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

KKR : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా కీల‌క నిర్ణ‌యం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టు రాత మారుస్తాడా..!

అదృష్టం ఏమిటంటే..? చాలా మంది మాదిరిగా తాను శారీర‌కంగా ఎక్కువ‌గా దెబ్బ‌తిన‌లేద‌ని తెలిపాడు. త‌న ఆరోగ్యం స‌మ‌స్య గురించి జ‌ట్టులో కొద్ది మందికి మాత్ర‌మే తెలుసున‌ని, కోచింగ్ సిబ్బందికి త‌నే ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. తాను ఆహ‌రం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఇక్క‌డ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కామెరూన్ గ్రీన్ పరిస్థితి కారణంగా అత‌డు 12 ఏళ్ల‌కు మించి బ‌త‌క‌డ‌ని వైద్యులు త‌మ‌కు చెప్పిన‌ట్లు గ్రీన్ తండ్రి గ్యారీ చెప్పారు.

ముంబై నుంచి ఆర్‌సీబీకి..

ఇటీవ‌ల ఐపీఎల్ ట్రేడింగ్‌లో కామెరూన్ గ్రీన్ ముంబైఇండియ‌న్స్ నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు మారాడు. కాగా.. ఐపీఎల్‌ల 2023 మినీ వేలంలో ముంబై జ‌ట్టు గ్రీన్‌ను రూ.17.50 కోట్ల‌కు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2023లో గ్రీన్ 16 మ్యాచులు ఆడాడు. 50.22 స‌గ‌టుతో 452 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు.

David Warner : డేవిడ్ వార్న‌ర్ భారీ శ‌త‌కం.. మిచెల్ జాన్సెన్‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు..