CSK : సీజన్ మధ్యలో సీఎస్కేకు భారీ షాక్..
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను (CSK) కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
CSK lose another player midway through IPL 2026 (pic credit@ipl)
- చెన్నైకి మరో షాక్..
- గాయంతో యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ మిగిలిన సీజన్‌కు దూరం
CSK : ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు ఓటములు, మరో వైపు గాయాలు ఆ జట్టును వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్) అరంగ్రేటం చేసిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సీఎస్కే వెల్లడించింది. అరంగ్రేట మ్యాచ్‌లోనే అతడు గాయపడినట్లు చెప్పుకొచ్చింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
ముంబైతో మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి కీలకమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను పడగొట్టాడు. అంతేకాదండోయ్ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్న తీరును ఎంత చెప్పుకున్నా తక్కువే.
Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు..
OFFICIAL ANNOUNCEMENT:
Ramakrishna Ghosh sustained a fracture to his right foot during the CSK v MI match at Chepauk.
He will take no further part in IPL 2026.
Get well soon, Rambo. pic.twitter.com/CQve4zLixG— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2026
ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రామకృష్ణ గాయపడ్డాడు. అతడి కుడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే అతడు మిగిలిన సీజన్‌కు దూరం అయ్యాడు. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా సీఎస్కేకు దూరం అయిన సంగతి తెలిసిందే. పిక్క గాయంతో బాధపడుతున్న ధోని ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
