David Warner : కింగ్స్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ .. ఆ స్టార్ ప్లేయర్ అరెస్ట్

David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, SRH మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

david warner in drunk and driving in australia faces court on it in 2026 may

  • డేవిడ్ వార్నర్ అరెస్ట్
  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
  • మే, 2026లో కోర్టు విచారణకు

David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, SRH మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో స్వదేశంలో సిడ్నీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఈ సంఘటన జరిగినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. వార్నర్ ప్రస్తుతం PSL (పాకిస్థాన్ సూపర్ లీగ్) 2026లో ఆడుతున్నాడు. అయితే మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో స్వదేశం ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంతో సిడ్నీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

పోలీసులు.. సిడ్నీలోని మరోబ్రా (Maroubra) ప్రాంతంలో రెగ్యులర్ చెకప్‌లు నిర్వహిస్తుండగా.. వారిని చూసిన వార్నర్ తన వాహనాన్ని పక్కన పార్క్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయన వద్దకు వచ్చి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఈ ప్రాథమిక పరీక్షలో వార్నర్ మద్యం సేవించినట్లు తేలడంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

David Warner : ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు.. ఆ దేశం తరపున రెండో ప్లేయర్ అతనే

అనంతరం మరోబ్రా పోలీస్ స్టేషన్‌లో వార్నర్‌కు పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా ఉన్నట్లు తెలిసింది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే చాలా ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్ మీద కేసు నమోదు చేశారు. మే 2026లో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన అనంతరం ఆయనను విడుదల చేశారు. ఈ కేసులో వార్నర్ వచ్చే నెలలో కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ జట్టుకు అతడు కెప్టెన్. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే వార్నర్ వ్యక్తిగత సెలవు మీద ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. పీఎస్ఎల్ కోసం త్వరలోనే అతడు మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లనున్నాడు.