Delhi Capitals : వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ఢిల్లీ కీల‌క నిర్ణ‌యం.. రూ.50ల‌క్ష‌ల‌కు కొత్త ప్లేయ‌ర్‌..

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Delhi Capitals : వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ఢిల్లీ కీల‌క నిర్ణ‌యం.. రూ.50ల‌క్ష‌ల‌కు కొత్త ప్లేయ‌ర్‌..

Delhi Capitals announce Harry Brook replacement

Delhi Capitals – Harry Brook : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌డ‌బ‌డుతోంది. రీ ఎంట్రీ ఇచ్చిన రిష‌బ్ పంత్ బాగానే ఆడుతున్న‌ప్ప‌టికి అత‌డి సార‌థ్యంలో జ‌ట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మ్యాచులు ఆడిన ఢిల్లీ నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో గెలిచింది. రెండు పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది.

బ్యాటింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫ‌లం అవుతోంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ స్థానంలో ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ లిజాడ్ విలిమ‌య్స్‌ను తీసుకుంది. అత‌డి బేస్‌ప్రైజ్ అయిన రూ.50ల‌క్ష‌ల‌కే అత‌డిని సొంతం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

Romario Shepherd : ఆఖ‌రి ఓవ‌ర్‌లో పెను విధ్వంసం పై షెఫ‌ర్డ్.. ప్ర‌తీ బంతిని..

‘టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపిఎల్ ) 2024లో మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.’ అని ఐపీఎల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో విలిమ‌య్స్ 2021 అడుగుపెట్టాడు. స‌ఫారీల త‌రుపున రెండు టెస్టులు, నాలుగు వ‌న్డేలు, 11 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Rohit Sharma : ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజ‌యం.. రోహిత్ శ‌ర్మ మూడు ప‌దాల పోస్ట్ వైర‌ల్‌..

కాగా.. వేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. అయితే.. నాన‌మ్మ మ‌ర‌ణించ‌డంతో అత‌డు ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. కుటుంబంతో స‌మ‌యం గ‌డ‌పాల‌ని అత‌డు భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌క‌ముందు అత‌డు ఎస్ఆర్‌హెచ్ కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆశించిన స్థాయిలో స‌త్తా చాట‌క‌పోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని వ‌దిలి వేయ‌గా ఢిల్లీ ద‌క్కించుకుంది.