Virat Kohli : ‘మీ భార్య..’ విరాట్ కోహ్లి మాటలు విని కంగుతిన్న దినేష్ కార్తీక్
ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తడబడుతోంది.
![Virat Kohli : ‘మీ భార్య..’ విరాట్ కోహ్లి మాటలు విని కంగుతిన్న దినేష్ కార్తీక్ Virat Kohli : ‘మీ భార్య..’ విరాట్ కోహ్లి మాటలు విని కంగుతిన్న దినేష్ కార్తీక్](https://10tv.in/wp-content/uploads/2024/04/Dinesh-Karthik-amazed-by-Virat-Kohlis-answer-your-wife-1.jpg)
Dinesh Karthik amazed by Virat Kohlis answer your wife
Virat Kohli – Dinesh Karthik : ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తడబడుతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌లోనే గెలవడంతో 2 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ఓటముల సంగతి కాస్త పక్క బెడితే మాత్రం దినేశ్ కార్తీక్ మాత్రం తన ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులతో రాణించాడు.
కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి కార్తీక్‌ను ఎంపిక చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ఓ వీడియో వైరల్‌గా మారింది. దినేశ్ కార్తీక్ భార్య గురించి విరాట్ కోహ్లి ఏదో చెప్పాడు. తొలుత కాస్త కన్ప్యూజ్ అయిన కార్తీక్ చివరికి ఒప్పుకున్నాడు.
IPL tickets : బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్..
ఈ వీడియోలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్లను ప్రశ్నలు అడుగుతున్నాడు దినేశ్ కార్తీక్. క్రికెటర్ కాకుండా నాకు ఇష్టమైన ఫేవరేట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని అడుగగా వెంటనే విరాట్ కోహ్లి.. మీ భార్య అని చెప్పాడు. ఈ ఆన్సర్ విన్న డీకే.. గొప్ప సమాధానం అని అన్నాడు. ఇది విన్న కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఆ పై డీకే మాట్లాడుతూ నా మైండ్‌లో వేరే వేరు సమాధానాలు ఉన్నాయి అని చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఎందుకు దినేష్ కార్తీక్ భార్య పేరును చెప్పాడని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీలో కొందరికి మాత్రం తెలిసే ఉంటుంది. దినేశ్ కార్తీక్ భార్య పేరు దీపికా పల్లికల్. ఆమె గొప్ప స్క్వాష్ ప్లేయర్. ఈ కారణంగానే కోహ్లీ.. దినేష్ కార్తీక్ ప్రశ్నకు సమాధానమిస్తూ దీపిక పేరును ప్రస్తావించాడు.
ఐపీఎల్ 2024లో దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతడు 75.33 సగటుతో 205.45 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli – the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024