Rohit Sharma : విరాట్ కోహ్లీ జెర్సీ ధ‌రించి రోహిత్ శ‌ర్మ కాళ్ల‌కు దండం పెట్టిన అభిమాని.. వీడియో వైర‌ల్

ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు మొద‌టి టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి.

Rohit Sharma : విరాట్ కోహ్లీ జెర్సీ ధ‌రించి రోహిత్ శ‌ర్మ కాళ్ల‌కు దండం పెట్టిన అభిమాని.. వీడియో వైర‌ల్

Fan wearing Virat Kohli shirt breaches security touches Rohit Sharmas feet

Rohit Sharma fan : ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు మొద‌టి టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్ ముగిసిన త‌రువాత భార‌త ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఇది చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది క‌ళ్లు గ‌ప్పిన ఓ అభిమాని మైదానంలోకి దూసుకువ‌చ్చాడు. క్రీజులో ఉన్న రోహిత్ శ‌ర్మ వద్ద‌కు వ‌చ్చి అత‌డు కాళ్ల‌కు దండం పెట్టాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 70 ప‌రుగులు చేయ‌గా బెయిర్‌స్టో (37), బెన్ డ‌కెట్ (35), జో రూట్ (29) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్‌, జ‌డేజాలు చెరో మూడు, బుమ్రా, అక్ష‌ర్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Rohan Bopanna : రికార్డుల‌ను తిర‌గ‌రాసిన రోహ‌న్ బోప‌న్న.. మొద‌టిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌కు

అనంత‌రం భార‌త జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్ క్రీజులో వ‌చ్చారు. వారు ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు సిద్ధం అవుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ పేరు ఉన్న జెర్సీ ధ‌రించిన ఓ అభిమాని భ‌ద్ర‌తా వ‌ల‌యం క‌ళ్లు గ‌ప్పి నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌కు వ‌చ్చాడు.


హిట్‌మ్యాన్ పాదాల‌ను తాకాడు. వెంట‌నే రోహిత్ అత‌డిని అలా చేయ‌కూడ‌ద‌ని చెప్ప‌గా కౌగిలించుకున్నాడు. సిబ్బంది అక్క‌డ‌కు వ‌చ్చి స‌ద‌రు అభిమానిని మైదానం నుంచి తీసుకువెళ్లారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

చారిత్రాత్మ‌క మైలురాయిని చేరుకున్న అశ్విన్‌-జ‌డేజా జోడీ.. కుంబ్లే-భ‌జ్జీల ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు..