T20 World Cup 2024 : అంతా మీ ఇష్టమేనా..? మాకు రోహిత్ శర్మనే కావాలి.. మీరు మార్చాల్సిందే.. నెటిజన్ల గరం గరం
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది.
![T20 World Cup 2024 : అంతా మీ ఇష్టమేనా..? మాకు రోహిత్ శర్మనే కావాలి.. మీరు మార్చాల్సిందే.. నెటిజన్ల గరం గరం T20 World Cup 2024 : అంతా మీ ఇష్టమేనా..? మాకు రోహిత్ శర్మనే కావాలి.. మీరు మార్చాల్సిందే.. నెటిజన్ల గరం గరం](https://10tv.in/wp-content/uploads/2024/01/New-Project-24-1.jpg)
Fans Angry As Hardik Pandya Shaheen Afridi Feature On India vs Pakistan T20 World Cup 2024 Promo
T20 World Cup 2024 Promo : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం టీమ్ఇండియా దృష్టి అంతా జూన్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 పైనే ఉంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది.
కాగా.. ఈ మెగాటోర్నీని స్టార్‌స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ పోరు జూన్ 9న జరగనుందనే విషయాన్ని తెలియజేస్తూ హార్దిక్ పాండ్య, షహీన్ అఫ్రిది ఫోటోతో కూడిన పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే.. పాకిస్తాన్ జట్టు షహీన్ అప్రిది సారధ్యంలో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా, టీమ్ఇండియా ఎవరి సారథ్యంలో ఆడనుంది అనే దానిపై క్లారిటీ లేదు.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడతాడని, అతడనే టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఫోటోను వాడడం పై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు. అధికారికంగా టీ20ల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోలేదు. ఇప్పటికీ అతడు కెప్టెనే. అలాంటప్పుడు హార్దిక్ పాండ్య ఫోటోలను ఎలా వాడుతారు..? ఇది సరైంది కాదని కామెంట్లు పెడుతున్నారు.
We want Rohit Sharma’s photo
— Sankott (@Iamsankot) January 5, 2024
Why Hardik Pandya in the poster ? How do you know that he will be the captain??
— Lalatendu Rout (@Littu85) January 5, 2024
How come you have shown pic of @hardik as Captain when officially @ImRo45 is still India’s T20 Captain.This is not correct,@BCCI.@HashTagCricket @AMP86793444 @CricCrazyJohns
— Narayan Mahadevan (@tmnarayan) January 5, 2024