Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ ఎవరితో ఆడనుందంటే?
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (Womens T20 World Cup 2026)ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 15 వరకు జరగనుంది.
ICC announces Womens T20 World Cup 2026 warm up matches schedule
- ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం
- టోర్నీలో పాల్గొననున్న 12 జట్లు
- ఈ టోర్నీకన్నా ముందు వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 15 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీ విడుదల చేసింది. 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో జూన్ 14న ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ టోర్నమెంట్‌కు ముందు నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ వెల్లడించింది.
మొత్తం 12 జట్లు జూన్ 6 నుంచి 10 వరకు నాలుగు వేదికల్లో తలా రెండేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో స్కాట్కాండ్తో నెదర్లాండ్స్ తలపడనుంది. భారత జట్టు జూన్ 8న వెస్టిండీస్‌తో, జూన్ 10న ఇంగ్లాండ్‌తో ఆడనుంది.
Ajinkya Rahane : ఆ ఒక్క తప్పే మా కొంపముంచింది.. కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కీలక వ్యాఖ్యలు..
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
* జూన్ 6న – నెదర్లాండ్స్ వర్సెస్ స్కాట్లాండ్ – డెర్బీ (ఉదయం 10 గంటలకు)
* జూన్ 6న – దక్షిణాఫ్రికా వర్సెస్ ఐర్లాండ్ – లౌబరో (ఉదయం 10 గంటలకు)
* జూన్ 6న – శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ -డెర్బీ (మధ్యాహ్నం 3 గంటలకు)
* జూన్ 6న – న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ – లౌబరో (మధ్యాహ్నం 3 గంటలకు)
* జూన్ 8న – వెస్టిండీస్ వర్సెస్ భారత్ – కార్డిఫ్ (ఉదయం 10 గంటలకు)
* జూన్ 8న – ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా – కార్డిఫ్(మధ్యాహ్నం 3 గంటలకు)
Devdutt Padikkal : అరె బాబు.. ఈ గోల్డ్ చైన్ నీదేనా? ఆర్సీబీ ప్లేయర్ నిజాయతీకి ఫ్యాన్స్ ఫిదా.. పిచ్ పై బంగారం దొరకగానే..
* జూన్ 9న – స్కాట్లాండ్ vs పాకిస్తాన్ – డెర్బీ(ఉదయం 10 గంటలకు)
* జూన్ 9న – ఐర్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ – లౌబరో(ఉదయం 10 గంటలకు)
* జూన్ 9న – నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక – డెర్బీ(మధ్యాహ్నం 3 గంటలకు)
* జూన్ 9న – దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ – లౌబరో(మధ్యాహ్నం 3 గంటలకు)
* జూన్ 10న – భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ – కార్డిఫ్(ఉదయం 10 గంటలకు)
* జూన్ 10న – వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా – కార్డిఫ్ (మధ్యాహ్నం 3 గంటలకు)
The warm-up fixtures for ICC Women’s #T20WorldCup 2026 have been revealed with 30 days to go 🏆
Full details ➡️ https://t.co/4gDF6qkqyU pic.twitter.com/HbJ5HwSsZ1
— ICC (@ICC) May 13, 2026
