IND vs ZIM : ఇంగ్లాండ్ గడ్డ పై చేదు ఫలితాలు.. అప్పుడే మరో సిరీస్.. వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు..
గురువారం (జూలై 23) నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో (IND vs ZIM) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది.
IND vs ZIM 3 Match t20 series starts from july 23rd
IND vs ZIM : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తీవ్ర నిరాశపరిచింది. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఈ ఓటముల బాధ నుంచి తేరుకోకముందే మరో సిరీస్‌కు సిద్ధమైంది. గురువారం (జూలై 23) నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2026 తరువాత టీమ్ఇండియా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోవడం గమనార్హం.
పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఓడిపోగా.. ఇంగ్లాండ్‌తో చేతిలో 4-0 తేడాతో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్‌లోనైనా శ్రేయస్ సేన విజయం సాధిస్తుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
బేబీ బాస్ రీ ఎంట్రీ..
భారీ అంచనాల మధ్య అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం రాగా తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లు ఆడబోయి రెండు సార్లు అతడికే వికెట్ సమర్పించుకుంటున్నాడు. దీంతో అతడి సామర్థ్యంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. తుది జట్టులోనూ స్థానం కోల్పోయాడు.
Rohit Sharma : రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్ శర్మ.. వాళ్లకు నాకు చెప్పింది అదే..
జింబాబ్వేతో టీ20 సిరీస్ వైభవ్‌కు మంచి అవకాశం. ఈ సిరీస్‌కు సంజూ శాంసన్‌కు విశ్రాంతి కల్పించడంతో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేయనున్నాడు.
షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 – జూలై 23న
* రెండో టీ20 – జూలై 25న
* మూడో టీ20 – జూలై 26న
ఈ మూడు మ్యాచ్‌లు హరారే వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నాయి.
Joe Root : నవ్వు తోపురా అయ్యా.. సిరీస్ మొత్తంలో ఒక్కసారి ఔట్ కాలే.. మెంటల్ ఎక్కించేశాడు..
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు..
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవిబిష్ణోయ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్మ, యాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్యన్ష్ షెడ్జే, అశోక్ శర్మ.
