IND vs WI : వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్.. భారత అసిస్టెంట్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు (IND vs WI) తలపడనున్నాయి.
India assistant coach Ryan ten Doeschate key comments ahead of IND vs WI clash
- భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్
- భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కటే కామెంట్స్
- విండీస్ బ్యాటింగ్ డెప్త్ తెలుసు, ఒత్తిడికి గురి కావడం లేదు
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. సౌతాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడం, జింబాబ్వే పై టీమ్ఇండియా ఘన విజయం సాధించడంతో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.
ఈ కీలక మ్యాచ్ ముందు భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కటే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటింగ్ గురించి తమకు పూర్తిగా తెలుసునని అన్నాడు. తాము ఒత్తిడికి గురి కావడం లేదన్నాడు. దేశం తరఫున ఆడటం ఎంత గొప్ప గౌరవమో, ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ విజయం సాధించడం ఎంత ముఖ్యమో వంటి విషయాలను ప్లేయర్లకు చెబుతూనే ఉంటామన్నాడు.
విండీస్‌కు లోతైన బ్యాటింగ్ డెప్త్ ఉందని, టెయింలెండర్లు కూడా దూకుడుగా ఆడతారన్నాడు. అలాగే భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ లోతుగా ఉందన్నాడు. గత మ్యాచ్‌లో తిలక్ వర్మను ఐదో స్థానంలో ఆడించామని, వెస్టిండీస్ పైనా అలాగే ఆడిస్తామా ? లేమా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నాడు.
జట్టులో చాలా ఆప్షన్లు ఉన్నాయన్నాడు. టాప్ ఆర్డర్లో సంజూ శాంసన్ ఆడడం వర్కౌట్ అయింది. కాంబినేషన్‌ను అప్పటికప్పుడు మార్చుకుని బరిలోకి దిగుతామన్నాడు. తిలక్ వర్మ ఏ స్థానంలో బరిలోకి దిగినా సరే సౌకర్యవంతంగా ఆడతాడన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు.
