India vs New Zealand 5th ODI : న్యూజిలాండ్‌తో ఐదో వన్డే.. టాస్ ఓడిన భారత్.. తుది జట్టులో ఆ ఇద్దరికి ఛాన్స్..
India vs New Zealand 5th ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఐదో వన్డే ప్రారంభమైంది.
India vs New Zealand 5th ODI
India vs New Zealand 5th ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఐదో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నాల్గో వన్డేలో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరిగే చివరి వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. యువ బౌలర్ యశ్ ఠాకూర్ వన్డేల్లోకి డెబ్యూ చేశాడు. అక్షర్ పటేల్ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. యశ్ ఠాకూర్‌తోపాటు హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
టాస్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని భావించామని చెప్పాడు. చివరి టెస్టులో విజయం సాధిస్తామని.. సిరీస్ ను కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశాడు.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధిర్, అకిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్
న్యూజిలాండ్ తుది జట్టు..
విల్ యంగ్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్కె, బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
New Zealand have won the toss and elect to bowl first in the 5th and final ODI of the series.
Two changes for #TeamIndia
Yash Thakur makes his debut and Mohd Siraj comes into the XI
Live – https://t.co/wqxhoXb2WC #NZvIND https://t.co/nYl2nc5OQo
— BCCI (@BCCI) November 15, 2026
