T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో (T20 World Cup 2026) భాగంగా బుధవారం భారత్, దక్షిణాప్రికా జట్లు తలపడనున్నాయి.
India vs South Africa T20 World Cup 2026 Warm up Match tomorrow
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026కి సమయం దగ్గర పడింది. మరో నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 7న ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నద్ధతను మొదలు పెట్టాయి. ఇక మెగాటోర్నీ కన్నా ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టీమ్ఇండియా కూడా టీ20 ప్రపంచకప్‌కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్‌ను ఆడనుంది. బుధవారం (ఫిబ్రవరి 4న) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్ 2024లో ఫైనలిస్ట్‌లు అయినా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరు జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో కొన్ని మాత్రమే ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇందులో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ సైతం ఉంది.
ఎక్కడ చూడొచ్చంటే?
టీ20 ప్రపంచకప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్స్ కలిగి ఉంది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్‌లు సైతం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోనే ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్‌స్టార్ యాప్, వైబ్సైట్లో మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
తొలి మ్యాచ్ ఎప్పుడంట?
టీ20 ప్రపంచకప్2026లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ఆడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్ఏతో భారత్ తలపడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
