IPL 2020: హైదరాబాద్ బ్యాటింగ్.. 3మార్పులతో సన్‌రైజర్స్
- Subhan Ali Shaik
- Published On : September 26, 2020 / 07:36 PM IST
ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీజన్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జట్టు హైదరాబాదే.. కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ముందుగా బ్యాటింగ్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇరుజట్లకు ఇది రెండో మ్యాచ్ కాగా.. తొలి మ్యాచ్ లలో ఓటమితోనే ముగించాయి. పాయింట్ల ఖాతా తెరవడానికి ఇరుజట్లు పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నాయి.
సన్‌రైజర్స్.. ఆర్సీబీ చేతిలో ఓడిపోగా, ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయం చెందింది. ఓవరాల్‌గా ఇరు జట్లు 17సార్లు తలపడగా కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 7 సార్లు గెలిచింది. మ్యాచ్‌లో హైదరాబాద్ 3 మార్పులతో బరిలోకి దిగుతోంది. మిచెల్ మార్ష్ స్థానంలో మహ్మద్ నబీ, విజయ్ శంకర్ స్థానంలో సాహా జట్టులోకి వచ్చాడు. సందీప్ శర్మను రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయగా, ఖలీల్ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
కేకేఆర్ 2 మార్పులతో బరిలోకి దిగింది. నాగర్‌కొటి కమ్లేష్, వరుణ్ చక్రవర్తిలు జట్టులోకి వచ్చారు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో కమిన్స్‌ను రూ. 15.50 కోట్లను వెచ్చించి కేకేఆర్ కొనుగోలు చేసింది. మరొకవైపు వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది.
Teams:
Kolkata Knight Riders: Sunil Narine, Shubman Gill, Dinesh Karthik(w/c), Nitish Rana, Eoin Morgan, Andre Russell, Pat Cummins, Kamlesh Nagarkoti, Varun Chakravarthy, Kuldeep Yadav, Shivam Mavi
Sunrisers Hyderabad: David Warner(c), Jonny Bairstow(w), Manish Pandey, Priyam Garg, Mohammad Nabi, Wriddhiman Saha, Abhishek Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, K Khaleel Ahmed/Sandeep Sharma, T Natarajan
