Preity Zinta : ఏమయ్యా కోచ్.. మనం వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయాం.. రికీ పాంటింగ్‌తో ప్రీతి జింటా సుదీర్ఘ చర్చ..
ముంబై ఇండియ్సన్ చేతిలో ఓటమి అనంతరం మైదానంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా (Preity Zinta), హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో చాలా సేపు సీరియస్‌గా చర్చించడం కనిపించింది.
IPL 2026 A long conversation between Preity Zinta and Ricky Ponting after pbks vs mi match
- గురువారం ముంబై చేతిలో ఓటమి..
- వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
- మ్యాచ్ అనంతరం కోచ్‌తో ప్రీతి జింటా సుదీర్ఘ మంతనాలు
Preity Zinta : ఐపీఎల్ 2026 ప్రథమార్థంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేలా కనిపించింది పంజాబ్ కింగ్స్. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఓటమే లేకుండా సాగింది ప్రయాణం. కట్ చేస్తే ఆ తరువాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌లో స్థానం లభించే పరిస్థితి ఉంది.
గురువారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం మైదానంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా, హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో చాలా సేపు సీరియస్‌గా చర్చించడం కనిపించింది. వరుస ఓటములు, ప్లేఆఫ్స్ అవకాశాలపై వారు చర్చించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. ఇలాగైతే ఎలా పాంటింగ్.. అని ప్రీతి జింటా అని ఉంటుందని పలువురు నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కింగ్స్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరిలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగంగా ఆడాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు సాధించాడు. కార్బిన్ బోష్, రాజ్ బవా చెరో వికెట్ తీశారు.
A long conversation between Preity Zinta and coach Ricky Ponting after Punjab Kings’ loss.👀 pic.twitter.com/tFXjOjMfzY
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 14, 2026
అనంతరం 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (75 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (48; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విల్ జాక్స్ (25 నాటౌట్ ;10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు దంచికొట్టారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, చహల్‌లు చెరో వికెట్ తీశారు.
RICKY PONTING EXPLAIN LOST AGAINST MUMBAI INDIANS TO PREITY ZINTA #PBKSvsMI #MIvsPBKS #IPL2026 #TATAIPL #PunjabKings #MumbaiIndians #ShreyasIyer #ArshdeepSingh #RohitSharma #HardikPandya #SuryakumarYadav pic.twitter.com/IENthS9yrA
— Infinite Infos (@infiniteInfos) May 14, 2026
