Virat Kohli : రజత్ పాటిదార్ విషయంలో కోహ్లీకి కోపమొచ్చింది.. అంపైర్‌తో వాదన.. అది ఔట్ కాదయ్యా..
జేసన్ హోల్డర్ వివాదాస్పద క్యాచ్ పై కోహ్లీ (Virat Kohli) తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అంపైర్‌తో సుదీర్ఘంగా వాదించాడు.
IPL 2026 GT vs RCB Jason holder catch controversy Virat Kohli animated chat with a match official
- గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఔట్ పై వివాదం
- రిప్లేలో జేసన్ హోల్డర్ క్యాచ్ అందుకున్న సమయంలో నేలను తాకినట్లుగా కనిపించిన బంతి
- అయినా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి
- ఫోర్త్ అంపైర్‌తో కోహ్లీ సుదీర్ఘ చర్చ
Virat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఔట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం పై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న నాలుగో అంపైర్‌తో తీవ్రంగా చర్చించాడు.
అసలేం జరిగింది?
ఆర్సీబీ ఇన్నింగ్స్ 8 ఓవరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్లోని నాలుగో బంతిని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ భారీ షాట్ ఆడాడు. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే హోల్డర్ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో వివాదం చెలరేగింది.
విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ ఆండీ ప్లవర్తో సహా ఆర్సీబీ డగౌట్ సభ్యులు ఆ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. హోల్డర్ క్యాచ్‌పై పూర్తి నియంత్రణలో లేడని, అతను డైవ్ చేసి జారినప్పుడు బంతి నేలను తాకిందని వారు సూచించారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ, ఓ మ్యాచ్ అధికారితో ఉద్రేకంగా వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఫ్లవర్ కూడా అతనితో కలిసి తన ఆందోళనలను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here is official video of Jason holder catch of rajat Patidar
In this clearly almost 1/4th ball touch and skid on ground
Virat Kohli angry on umpire and totally worst umpiring in this match pic.twitter.com/YqlJtDOV1v
— VK (@Aur_vicky) April 30, 2026
భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా సోషల్ మీడియాలో ఆ క్యాచ్ చట్టబద్ధతను ప్రశ్నించారు. హోల్డర్ పూర్తి నియంత్రణలో లేడని అన్నాడు.
నిబంధనలు ఇవే..
ఎంసీసీ క్రికెట్ సెక్షన్ 33.3 నిబంధన ఏం చెబుతుంటే.. బంతి మొదటిసారి ఫీల్డర్ శరీరాన్ని తాకిన సమయం నుండి క్యాచ్ పట్టే చర్య ప్రారంభమవుతుంది. బంతిపైనా, తన కదలికలపైనా ఫీల్డర్ పూర్తి నియంత్రణ సాధించినప్పుడు అది ముగుస్తుంది అని సూచిస్తుంది.
అంపైర్లకు తనకంటే ఎక్కువగానే నిబంధనలు తెలిసి ఉండవచ్చని, అయితే బంతి నేలను తాకినట్లు టెలివిజన్ రీప్లేలలో స్పష్టంగా కనిపించిందని చోప్రా వాదించారు.
“నా అభిప్రాయం ప్రకారం, అంపైర్లకు దీనిపై బాగా తెలుసని నాకు తెలుసు, అతను క్యాచ్ పట్టినప్పుడు నియంత్రణలోనే ఉన్నాడు. కానీ అతను డైవ్ చేసి, ఆ తర్వాత స్లైడ్ చేసినప్పుడు, అతను పూర్తిగా నియంత్రణలో లేడు. మీరు ఆగిన తర్వాత, లేచి నిలబడటానికి బంతి సహాయం తీసుకుంటే, అప్పటికే క్యాచ్ పూర్తయి ఉంటుంది కాబట్టి, నా అభిప్రాయంలో ఆ క్యాచ్ లెక్కలోకి వస్తుంది. కానీ మీరు స్లైడ్ చేస్తున్నప్పుడు అలా జరగదు. మనమందరం చూసిన దృశ్యాల ఆధారంగా, బంతి నేలను తాకిందని నాకు అనిపించింది. అందుకే బహుశా అతను అవుట్ కాకపోవచ్చు, కానీ అతన్ని అవుట్ ఇచ్చారు,” అని చోప్రా పోస్ట్ చేసిన ఓ వీడియోలో అన్నారు.
👀 Was Rajat Patidar OUT or NOT-OUT? #Aakaahvani #GTvsRCB #IPL pic.twitter.com/aTesD84RVz
— Aakash Chopra (@cricketaakash) April 30, 2026
