IPL 2026: గర్జించిన గుజరాత్.. చిత్తుగా ఓడిన హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది.
IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. 82 పరుగుల తేడాతో జీటీ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది. 169 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయలేక హైదరాబాద్ చేతులెత్తేసింది. 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
గుజరాత్ బౌలర్లు చెలరేగిపోయారు. నిప్పులు చెరిగే బంతులతో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. రబాడ, హోల్డర్ ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించారు. రబాడ, హోల్డర్ చెరో మూడు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ ఘన విజయంతో గుజరాత్ 16 పాయింట్స్ తో టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ కి దూసుకెళ్లింది. చిత్తుగా ఓడిన హైదరాబాద్ మూడో ప్లేస్ లో ఉంది. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది వరుసగా 5వ విజయం.
