Hardik Pandya : రాజస్థాన్‌తో ముంబై మ్యాచ్ నేడు.. హార్దిక్ పాండ్యా ఆడేనా? ముంబై కోచ్ ఏమన్నాడంటే?
రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆడతాడా? లేదా ? అనే విషయాలపై ముంబై బౌలింగ్ కోచ్ స్పష్టత నిచ్చాడు.
IPL 2026 Hardik Pandya will play today RR vs MI match
- నేడు గౌహతి వేదికగా రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్
- అనారోగ్యంతో గత మ్యాచ్ ఆడని ముంబై కెప్టెన్
- ఆర్ఆర్తో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే విషయం పై స్పష్టత ఇచ్చిన ముంబై బౌలింగ్ కోచ్
Hardik Pandya : ఐపీఎల్ 2026 సీజన్‌ను విజయంతో ఆరంభించింది ముంబై ఇండియన్స్. అయితే.. ఆ తరువాత విజయ పరంపరను కొనసాగించడంలో తడబడింది. శనివారం (ఏప్రిల్ 4న) జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. అయితే.. ఢిల్లీతో మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలను నిర్వర్తించాడు. సూర్య జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలం అయ్యాడు.
ఇక ముంబై జట్టు నేడు (ఏప్రిల్ 7)న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడతాడా? లేదా? విషయం పై ఆసక్తి నెలకొంది. దీనిపై ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మ్హంభ్రే స్పష్టత ఇచ్చాడు. హార్దిక్ ఈ మ్యాచ్‌లో ఆడతాడని అతడు స్పష్టం చేశాడు. అతడికి ఎలాంటి గాయం కాలేదని, కేవలం అనారోగ్యంతోనే గత మ్యాచ్‌కు దూరం అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నట్లు తెలిపాడు.
KKR vs PBKS : కోల్‌కతాకు వరుణుడి సాయం.. పాయింట్ల ఖాతా ఓపెన్..
‘రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడు. అతడికి ఎలాంటి గాయం కాలేదు. అనారోగ్యంతో ఉండడంతోనే గత మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. రెండు నెట్స్ సెషన్లలో కూడా పాల్గొన్నాడు.’ అని మ్యాచ్‌కు ముందు రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరాస్ మ్హంభ్రే తెలిపాడు.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ముంబై ఎక్కడ ఉంది?
ఈ సీజన్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో విజయం సాధించగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా నెట్ రన్‌రేటు -0.206గా ఉంది.

ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆర్ఆర్ పై భారీ విజయం సాధించి తమ పాయింట్లను పెంచుకోవడంతో పాటు నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవాలని ముంబై భావిస్తోంది.
