Angkrish Raghuvanshi : కావాలనే రఘువంశీ బంతిని అడ్డుకున్నాడా? ఔట్ దుమారం.. అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అంటే ఏమిటి?
అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద కేకేఆర్ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi) ఔట్ అయ్యాడు.
IPL 2026 LSG vs KKR Angkrish Raghuvanshi Given Out For Obstructing The Field
- అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద రఘువంశీ ఔట్
- అతడి ఔట్ పై దుమారం
- రెండుగా విడిపోయిన నెటిజన్లు
Angkrish Raghuvanshi : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద కేకేఆర్ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అతడి ఔట్ వివాదాస్పదంగా మారింది.
అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ డకౌట్ కావడంతో అంగ్క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్స్ యాదవ్ ఈ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్లోని ఓ బంతిని రఘవంశీ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోని గ్రీన్ సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. దీంతో రఘువంశీ వెనుదిరగక తప్పలేదు.
అదే సమయంలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్ల వైపుగా బంతిని విసిరాడు. రఘువంశీ క్రీజును సమీపిస్తుండగా షమీ వేసిన బంతి అతడి కాళ్లకు తగిలింది. దీంతో అతడు కావాలనే బంతిని అడ్డుకున్నాడని ఆరోపిస్తూ షమీ, రిషబ్ పంత్ లు అబ్స్ట్రక్టింగ్ ఫీల్డ్ కింద అతడు ఔట్ అని అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయం కోరారు.
పలు మార్లు రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బ్యాటర్ పరిగెత్తే క్రమంలో కావాలనే దిశ మార్చుకున్నాడని, బంతిని వికెట్ కీపర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని భావించాడు. ఈ క్రమంలో అబ్స్ట్రక్టింగ్ ఫీల్డ్ కింద అతడిని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కేకేఆర్ ఆటగాళ్లకు షాక్ కు గురి అయ్యారు. రఘువంశీ మైదానంలోని అంపైర్లతో వాదనకు దిగినా ఫలితం లేకపోయింది. అతడు బౌండరీ లైన్ దాటిన తరువాత తన హెల్మెట్, బ్యాట్‌ను విసిరికొట్టాడు. ఇక దీనిపై కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో పాటు ఓనర్ వెంకీ మైసూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔
What’s your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire !
What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండు విడిపోయారు. కొందరు ఔట్ అని అంటుండగా మరికొందరు కాదని అంటున్నారు.
యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, జడేజాల తరువాత ఐపీఎల్లో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.
అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అంటే ఏమిటి?
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధన 37 ప్రకారం.. ఓ బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా తన మాటలతో లేదా చేతలతో ఫీల్డింగ్ జట్టును అడ్డుకున్నా లేదా వారి ఏకాగ్రతను దెబ్బతీసినా ‘ఔట్’గా పరిగణిస్తారు. వికెట్లకు బంతి తగలకుండా అడ్డుకోవడానికి తమ మార్గాన్ని మార్చుకోవడం, రనౌట్ లేదా క్యాచ్‌ను అడ్డుకోవడానికి బ్యాట్ లేదా శరీరాన్ని అడ్డుపెట్టడం, ఫీల్డర్ అనుమతి లేకుండా బంతిని చేత్తో పట్టుకుని వారికి అందించడం వంటి ఘటనలను అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ గా పరిగణిస్తారు. వెంటనే అతడిని ఔట్ ఇస్తారు.
OBSTRUCTING THE FIELD :
➡️ Angkrish Raghuvanshi gone for Obstructing the field.
Disappointed that Rishabh Pant going against spirit of the game. Even he can withdraw the appeal but he didn’t.🙃 pic.twitter.com/fh64DXfG4U
— Maina Singh (@Maina_Singhx77) April 26, 2026
