IPL 2026 : సోదరుడు హార్దిక్ ఔట్ కాగానే కాస్త అతిగా సంబరాలు చేసుకున్న కృనాల్ పాండ్యా.. వీడియో వైరల్..
ఐపీఎల్ 2026 సీజన్లో (IPL 2026) ముంబై ఇండియన్స్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
IPL 2026 MI vs RCB Krunal Pandya celebrations viral after Brother Hardik Pandya Dismissal
- హార్దిక్ పాండ్యా ఔట్ కాగానే
- అతిగా సంబరాలు చేసుకున్న సోదరుడు కృనాల్ పాండ్యా
- సీరియస్‌గా మైదానాన్ని వీడిన ముంబై కెప్టెన్
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ మోస్తరుగా రాణించాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ బాది 40 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ 15 ఓవర్లో నాలుగో బంతికి హార్దిక్ ఔట్ అయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు హార్దిక్ పాండ్యా యత్నించాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద రొమారియో షెపర్డ్ క్యాచ్ అందుకోవడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక హార్దిక్ వికెట్ పడడంతో ఆర్సీబీ ఆటగాడు, హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మ్యాచ్ ఇక తమ చేతుల్లోకి వచ్చిందనే భావనలో కృనాల్ కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. కృనాల్ సంబరాలను చూస్తూ కాస్త సీరియస్‌గానే హార్దిక్ మైదానాన్ని వీడాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫిల్ సాల్ట్ (78), రజత్ పాటిదార్ (53), విరాట్ కోహ్లీ (50) లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్లు తలా ఓ వికెట్ తీశారు.
Bhaivalry was at it’s peak, emotions running high 🔥#MIvRCB | [Mumbai Indians, Rohit, Kohli, Tilak, Rajat Patidar] pic.twitter.com/CTEtAgcNiB
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
Virat Kohli : విరాట్ కోహ్లీ గాయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్.. నిజం చెప్పాలంటే..
అనంరతం 241 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (71) అర్ధశతకం సాధించాడు. హార్దిక్ పాండ్యా (40) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ, రసిఖ్ సలాం దార్, కృనాల్ పాండ్యా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
