IPL 2026 PBKS vs RR : మా ఓటమికి వాళ్లే కారణం.. మేము ఆ ఒక్క పనిచేసుంటే గెలిచేవాళ్లం.. శ్రేయాస్ అయ్యర్
IPL 2026 PBKS vs RR : మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మేము 222 పరుగుల భారీ స్కోర్ చేశాం. ఇది డిఫెండ్ చేసుకోగల స్కోర్. కానీ, ఆమేరకు మేము రాణించలేక పోయామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు.
Shreyas Iyer
- రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ ఓటమి
- ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్ఆర్ జట్టు
- ఓటమిపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్
IPL 2026 PBKS vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read : IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్.. ఈ సీజన్లో తొలి ఓటమి.. రాజస్తాన్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. 223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ జట్టు 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
మేము ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో బౌలింగ్ వైఫల్యం ప్రధాన కారణం. మేము 222 పరుగుల భారీ స్కోర్ చేశాం. ఇది డిఫెండ్ చేసుకోగల స్కోర్. బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. పిచ్ స్టిక్కీగా, స్లోగా ఉన్నా కూడా అసాధారణ ప్రదర్శనతో భారీ స్కోర్ చేయగలిగాం. కానీ, మా ప్రణాళికలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయాం అని శ్రేయాస్ అయ్యర్ చెప్పారు.
మా ప్రణాళిక ప్రకారం.. ముఖ్యంగా స్లోబాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేశాం. కానీ, అలా జరగలేదు. మిడిల్ ఓవర్లలో ఫెరారీ, శుభమ్ దూబే కీలక భాగస్వామ్యంతో మా ఓటమికి కారణమయ్యారు. ఈ ఫార్మాట్ లో చాలా మంది బ్యాటర్లు తమ ఆటను మార్చుకున్నారు. తొలి బంతి నుంచే వేగంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో బౌలర్లకు కష్టంగా మారింది.
బౌలర్లు ఒక్క ప్రణాళికతో కాకుండా పలు రకాల ప్రణాళికతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంకూడా బౌలర్లకు ప్రస్తుతం సవాల్‌గా మారింది. ప్రణాళికలకు తగ్గట్టు బౌలింగ్ చేస్తే విజయం దక్కుతుంది. కానీ, ఈరోజు మా విషయంలో అది జరగలేదని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చారు.
ప్రయాణాల వల్ల కాస్త అలసట ఉన్నా.. దాన్ని సాకుగా చెప్పలేం. కానీ, మా తదుపరి మ్యాచ్ కు కొన్ని రోజుల విరామం ఉంది. ప్రస్తుతం మేము చేస్తున్న తప్పులను సరిదిద్దుకొని రాబోయే మ్యాచ్ లలో బరిలోకి దిగుతాం అని శ్రేయాస్ అయ్యర్ చెప్పారు.
