Vaibhav Sooryavanshi injury : రాజస్థాన్‌కు భారీ షాక్.. నడవలేని స్థితిలో వైభవ్ సూర్యవంశీ.. ఇద్దరి సాయంతో.. ఐపీఎల్ నుంచి ఔట్?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi injury)గాయపడ్డాడు.
IPL 2026 RR vs SRH Vaibhav Sooryavanshi injury and leaves the field
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ వైభవ్ సూర్యవంశీ
- తొడకండరాలు పట్టేశాయి
- నడవలేకపోవడంతో ఇద్దరి సాయంతో మైదానాన్ని వీడిన 15 ఏళ్ల బుడ్డోడు
Vaibhav Sooryavanshi injury : రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో 15 ఏళ్ల వైభవ్ గాయంతో మైదానాన్ని వీడాడు.
అసలేం జరిగిందంటే?
229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. ఈ ఓవర్లోని ఓ బంతిని ఇషాన్ కిషన్ షాట్ ఆడాడు. బంతిని అందుకోవడానికి సూర్యవంశీ పరిగెత్తాడు. అయితే.. అకస్మాత్తుగా తొడకండరాలు పట్టేయడంతో నెమ్మదించిన అతడు కిందపడిపోయాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు.
వెంటనే ఫిజయో వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. అయినప్పటికి అతడి నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియోతో పాటు మరో వ్యక్తి సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తరువాత అతడు మరోసారి మైదానంలో అడుగుపెట్టలేదు. దీంతో అభిమానులు అతడికి ఏమైందోనని కంగారు పడుతున్నారు.
PV Sindhu : అరెరె.. పీవీ సింధుకు ఏమైంది ? ఫోటోలు వైరల్..
ఇదిలా ఉంటే.. అతడి గాయం తీవ్రత పై ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రోజు అతడి గాయానికి స్కానింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అతడు ఈ సీజన్‌కు దూరం కావచ్చునని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం అది రాజస్థాన్ రాయల్స్‌కు తీవ్ర ఎదురుదెబ్బ కానుంది.
Vaibhav Sooryavanshi is off the field due to injury! 🤕#IPL2026 #RRvSRH pic.twitter.com/LTce02epAE
— Rahul Yadav (@Rahul3kr) April 25, 2026
15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ శతకంతో చెలరేగాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతడికి ఇది రెండో సెంచరీ.
