IPL 2026 : మా ఓటమికి కారణం వారే.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
IPL 2026 : మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
Ishan Kishan
- ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం
- మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
- వారివల్లే మేము ఓడిపోయామని వెల్లడి
IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్ ప్రాంరభమైంది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడారు. కేవలం 15.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగులు చేశారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు. టాప్-3 బ్యాటర్ల వైఫల్యంతో పాటు పేలవ బౌలింగ్ తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. మొదటి మూడు, నాలుగు ఓవర్ల తరువాత పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించింది. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాం. ఈ విషయం పై మే ఫోకస్ పెట్టాలి.
రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్ కు మరింత ఈజీగా మారింది. మా బ్యాటర్ల ప్రదర్శనను అభినందించాలి. ఇక ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతన్ని సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలి.. లేదంటే క్రీజులో సెట్ అయితే ఆపడం కష్టం. మేము ఆ విషయంలో విఫలమయ్యాం. ఫలితంగా భారీ స్కోర్ చేసినా మ్యాచ్ను చేజార్చుకున్నాం.
తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇలాంటి పొరపాట్లు రాబోయే మ్యాచ్ లలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. బౌలింగ్ విభాగం మేము ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. వికెట్లు తీయడంలో కాస్త విఫలమయ్యాం. రాబోయే మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చేస్తాం. రాబోయే మ్యాచ్ లలో విజయం సాధిస్తే టోర్నీలో మా ప్రయాణం మరింత సులువు అవుతుందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
Ishan Kishan said “It’s very important to get the wicket of Virat bhai in the chase earlier or it’s difficult to stop him”. pic.twitter.com/XHIzYR5CLC
— Johns. (@CricCrazyJohns) March 28, 2026
