Pat Cummins fined : గుజరాత్ పై ఘోర ఓటమి.. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ జరిమానా..
గుజరాత్ టైటాన్స్ పై ఘోర ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు (Pat Cummins fined) రూ.12 లక్షల జరిమానా విధించారు
IPL 2026 Sunrisers Hyderabad Captain Pat Cummins fined after his team maintained a slow over rate vs GT (pic credit@ipl)
- ఓటమి బాధలో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్
- కెప్టెన్ కమిన్స్‌కు భారీ జరిమానా
- గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు
- ఈ సీజన్లో ఇదే తొలిసారి కావడంతో 12లక్షల ఫైన్
Pat Cummins fined : అసలే గుజరాత్ టైటాన్స్ పై ఘోర ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు స్లో ఓవర్ రేటు(నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడం)ను నమోదు చేయడమే ఇందుకు కారణం.
ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు తొలిసారి స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. కాబట్టి కెప్టెన్ అయిన కమిన్స్ కు 12 లక్షల జరిమానా విధించారు. అదే రెండో సారి కూడా ఈ తప్పిదం చేస్తే.. అప్పుడు కెప్టెన్ కమిన్స్‌కు 24లక్షలతో పాటు ఇంపాక్ ప్లేయర్ సహా జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది జరిమానా విధిస్తారు.
‘ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 56వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్లో అతని జట్టు చేసిన మొదటి ఉల్లంఘన కావడంతో కమిన్స్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించాం.’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
