Sunrisers Hyderabad : ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడే.. సన్‌రైజర్స్ జట్టులోకి సఫారీ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ.. 145 కి.మీ వేగం..
గాయపడిన ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ పేన్ స్థానంలో సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీని సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తీసుకుంది.
IPL 2026 Sunrisers Hyderabad pick Gerald Coetzee as injury replacement for David Payne
- గాయంతో మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ పేన్
- అతడి స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ తీసుకున్న సన్‌రైజర్స్
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ పేన్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీని తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ స్టార్ పేసర్‌ను 2 కోట్లకు తీసుకుంది.
వాస్తవానికి సీజన్ ఆరంభంలో జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో తప్పుకోవడంతో అతడి స్థానంలో డేవిడ్ పేన్ ను ఎస్ఆర్హెచ్ తీసుకుంది. డేవిడ్ పేన్ ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అతడు దురదృష్టవశాత్తు చీలమండల గాయానికి గురైయ్యాడు. దీంతో మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో గెరాల్డ్ కోయెట్జీ వచ్చాడు.
గెరాల్డ్ కోయెట్జీకి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 14 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరుపున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 67 వికెట్లు పడగొట్టాడు. 145 కి.మీ వేగంగతో బౌలింగ్ చేసే కోయెట్జీ రావడంతో ఎస్ఆర్హెచ్ పేస్ విభాగం మరింత బలోపేతం కానుంది.
View this post on Instagram
సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ నాటికి గెరాల్డ్ కోయెట్జీ జట్టుతో చేరే అవకాశం ఉంది.
