IND vs PAK : ‘నా గేమ్ ప్లాన్ ఇదే.. పిచ్‌తో నాకు సంబంధం లేదు.. బాల్ పడిందా..’ ఇషాన్ కిషన్ కామెంట్స్ వైరల్..
భారత్ పై పాక్ విజయం సాధించడంలో (IND vs PAK ) ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.
Ishan Kishan comments after PLAYER OF THE MATCH award against Pakistan
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ పై భారత్ గెలుపొందింది. భారత విజయంలో టీమ్ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. 40 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించడంతో ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును తీసుకున్న తరువాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన ఒక్కడి వల్లే కాదని, సమిష్టి ప్రదర్శనతోనే పాక్ పై విజయం సాధించామని చెప్పుకొచ్చాడు.
100 శాతం ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే.. నేను మాత్రం నా బలాన్ని నమ్ముకున్నాను. ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాను. బంతి పై మాత్రమే దృష్టి సారించా. బంతి గమనానికి తగ్గట్లుగా షాట్లు ఆడాను. వీలైన వరకు మైదానంలోకి ఖాళీల్లోకి బంతిని కొడుతూ ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీసేందుకు ప్రయత్నించాను. అని ఇషాన్ కిషన్ అన్నాడు.
తన ఆఫ్ సైడ్ గేమ్ పై మరింత మెరుగుపరచుకున్నానని చెప్పాడు. దీంతో బౌలర్లు తన ఏరియాలో బంతులు వేసే విధంగా చేయగలిగానని తెలిపాడు. మైదానం పెద్దది కావడంతో గ్యాప్‌లు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇక పిచ్ ఈజీగా లేకపోవడంతో 160 నుంచి 170 పరుగులు చేస్తే గెలవొచ్చునని భావించినట్లుగా తెలిపాడు.
ఇక పాక్ పై ఆడడం గురించి మాట్లాడుతూ.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని అన్నాడు. అది కేవలం తనకు మాత్రమే కాదని, యావత్ భారత దేశానికి కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనదని అన్నాడు. ఇక పాక్ పై గెలవడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని చెప్పాడు.
బంతితో రాణించిన హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాలపై ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వారిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. తాను బ్యాటింగ్ చేసే సమయంలో షాహీన్ అఫ్రిది బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ నుంచి పేసర్లకు పెద్దగా సహకారం లేదని అనిపించిందన్నాడు.
IND vs PAK : భారత్ చేతిలో తుక్కుతుక్కు ఓడిపోయాక పాక్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లో చేసిందిదే..
అయినప్పటికి కూడా బుమ్రా, హార్దిక్ చాలా చక్కగా బంతులు వేశారన్నాడు. బుమ్రా కొత్త బంతితోనైనా, డెత్ ఓవర్లలోనైనా ఎలా బౌలింగ్ చేస్తాడు అనే విషయం అందరికి తెలుసునని చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ తన ప్రణాళికలను మైదానంలో చక్కగా అమలు చేశాడని, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడని అన్నాడు. ఇక ఈ విజయంలో హార్దిక్ కు కూడా గెలుపు క్రెడిట్ దక్కుతుందన్నాడు.
