Sanju Samson : సంజూ శాంసన్ స్వయంకృతాపరాధం.. అనుభవించాల్సిందేనా..! టీ20ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్!
పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్ (Sanju Samson) ను పక్కన పెట్టేశారు.
Ishan Kishan is the opener in T20 world cup clarify after the warm up match
Sanju Samson : టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారో అన్న సంగతి దాదాపుగా తేలిపోయింది. అభిషేక్ శర్మకు తోడుగా ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయం బుధవారం నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ద్వారా అర్థమవుతోంది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టేశారు. తిలక్ వర్మ రావడంతో భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు.
ఇక వచ్చిన అవకాశాన్ని కూడా ఇషాన్ కిషన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సంజూకు కనీసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో టీ20 ప్రపంచకప్ ఓపెనర్‌గా ఇషాన్‌ను పంపించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
Ishan Kishan : అలా ఎలా కొట్టావ్ ఇషాన్.. ఈ షాట్‌ను ఏమని పిలవాలో? వీడియో
స్వయంకృతాపరాధం..!
గత కొన్నాళ్లుగా సంజూ శాంసన్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్‌తో జట్టుకు దూరం కావడంతో టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ ఓపెనర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే అతడిని న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఓపెనర్‌గా జట్టు మేనేజ్మెంట్ పంపించింది. అయితే.. 5 మ్యాచ్‌ల్లో కలిపి అతడు కేవలం 46 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు మొదలు అయ్యాయి.
అనూహ్యంగా జట్టులోకి వచ్చి..
దాదాపు రెండేళ్ల పాటు టీమ్ఇండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ దేశవాళీలో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలో రాణించి కివీస్ తో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే.. తిలక్ వర్మ శస్త్రచికిత్స కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరం కావడం ఇషాన్ కు కలిసి వచ్చింది. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం..!
ఐదో టీ20లో శతకంతో చెలరేగాడు. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 215 పరుగులతో సత్తా చాటాడు. దీంతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి తీసుకువచ్చాడు. ఇప్పుడు తిలక్ అందుబాటులోకి రావడంతో మెగాటోర్నీలో ఇషాన్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉంది.
