Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ గడ్డపై ఏకైక భారత బౌలర్
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో (Jasprit Bumrah ) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
Jasprit Bumrah creates history Most ODIs wickets for India in England
Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 150 వికెట్లను పడగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ మైలురాయిని సాధించాడు. 90 మ్యాచ్‌ల్లో బుమ్రా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయిని చేరుకునేందుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.
కాగా.. అతి తక్కువ బంతుల్లో వన్డేల్లో 150 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. 4070 బంతుల్లో 150 వికెట్లు తీసి షమీ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు.
అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* మహ్మద్ షమీ – 4070 బంతులు
* కుల్దీప్ యాదవ్ – 4513 బంతులు
* జస్ప్రీత్ బుమ్రా – 4605 బంతులు
* అజిత్ అగార్కర్ – 5027 బంతులు
* ఇర్ఫాన్ పఠాన్ – 5131 బంతులు
చరిత్ర సృష్టించిన బుమ్రా..
ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు రవీంద్ర జడేజాను అధిగమించాడు. జడేజా ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో 30 వికెట్లు తీయగా.. హ్యారీ బ్రూక్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వికెట్ల సంఖ్య 31కి చేరింది. ఇక ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్, మదన్ లాల్, షమీలు ఉన్నారు.
IND vs ENG : టాస్ ఓడిన భారత్.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* జస్ప్రీత్ బుమ్రా – 31 వికెట్లు
* రవీంద్ర జడేజా – 30 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 28 వికెట్లు
* మదన్ లాల్ – 27 వికెట్లు
* మహ్మద్ షమీ – 26 వికెట్లు
