అందుకే ధోనీ లెజెండ్! సెక్యూరిటీ గార్డు షేక్ హ్యాండ్ ఇస్తూ…
- Subhan Ali Shaik
- Published on- March 3, 2020 / 11:27 AM IST
ధోనీ అభిమానుల కల.. నెలల పాటు నిరీక్షణ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. వరల్డ్ కప్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ఓటమి తర్వాత ధోనీ ఆడింది లేదు. ఇన్నాళ్ల తర్వాత ఐపీఎల్ 2020 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ప్రాక్టీస్‌కు రెడీ అయిపోయాడు. సోమవారం మార్చి 2న చెన్నైకు చేరుకున్నాడు రాంచీ సూపర్ స్టార్.
ఈ మేరకు హోటల్‌కు చేరుకున్న ధోనీ కోసం సిబ్బంది తరలివచ్చారు. వాళ్లలో కారు దిగగానే ముందుకు వచ్చిన సెక్యూరిటీ గార్డును పలకరించిన ధోనీ షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేసింది. ఆ తర్వాత నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. అభిమాన తలైవాను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు.
ఇటీవల ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లపై ఇప్పటి వరకూ ధోనీ స్పందించలేదు. వరల్డ్ కప్ టోర్నమెంట్ తర్వాత భారత ఆర్మీలో సేవలందించాలని ధోనీ వెళ్లిపోయాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దాంతో పాటు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లోనూ స్థానం కోల్పోయాడు.
