Michael Vaughan : దక్షిణాఫ్రికాకు అంత సీన్ లేదు.. టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే..
టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్‌కు చేరే జట్లు ఏవో మైఖేల్ వాన్ (Michael Vaughan ) జోస్యం చెప్పాడు.
Michael Vaughan names T20 World Cup 2026 semi finalists
Michael Vaughan : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 7న) ప్రారంభం కానుంది. 20 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఈ జట్లను ఐదేసీ చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.
గ్రూపు-ఏలో భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉండగా గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌లు ఉన్నాయి. ఇక గ్రూప్-సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్లు ఉండగా గ్రూప్-డిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈలు ఉన్నాయి.
Tilak Varma : రీఎంట్రీలో తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో
ఫార్మాట్ ఇలా..
గ్రూప్‌లోని ప్రతి జట్టూ.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ఐసీసీ సీడింగ్స్ ఆధారంగా అర్హత సాధించిన ఎనిమిది జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ కూడా గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత గ్రూప్‌లో టాప్-2 లో నిలిచిన జట్టు సెమీస్‌కు చేరుకుంటాయి.
సెమీస్ చేరే జట్లు ఇవే..
టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడడంతో సెమీఫైనల్ కు చేరుకునే జట్లు ఏవో దిగ్గజ ఆటగాళ్లు ఓ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా అంచనా వేశాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ 2024లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టును వాన్ పక్కన పెట్టేశాడు.
My 4 T20 World Cup semi finalists will be … India , England , NZ & Australia … #OnOn #India
— Michael Vaughan (@MichaelVaughan) February 2, 2026
