Mumbai Indians : ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన మిచెల్ సాంట్నర్.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌తో ఎంఐ డీల్..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) ఏదీ కలిసి రావడం లేదు.
Mumbai Indians sign Keshav Maharaj as replacement for injured Mitchell Santner
- గాయంతో మిగిలిన సీజన్‌కు దూరమైన మిచెల్ సాంట్నర్
- అతడి స్థానంలో కేశవ్ మహరాజ్‌ను తీసుకున్న ముంబై
Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఓ వైపు వరుస పరాజయాలు వేధిస్తుండగా మరో వైపు గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ భుజం గాయంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ధృవీకరించింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో అతడి భుజానికి గాయమైంది. దీంతో ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆ తరువాత కోలుకుని గుజరాత్, ఆర్సీబీతో మ్యాచ్‌లు ఆడాడు.
Vaibhav Sooryavanshi : వైభవ్ ఏంది నీ వైభోగం.. ఆ డిమాండ్ ఏందయ్యా.. ఫోటోకు 100 రూపాయల.. వామ్మో..
📝𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐬𝐢𝐠𝐧𝐬 𝐊𝐞𝐬𝐡𝐚𝐯 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐣 𝐚𝐬 𝐑𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐦𝐞𝐧𝐭 𝐟𝐨𝐫 𝐌𝐢𝐭𝐜𝐡𝐞𝐥𝐥 𝐒𝐚𝐧𝐭𝐧𝐞𝐫
Mumbai Indians have confirmed the signing of South African left-arm spinner Keshav Maharaj as a replacement for Mitchell Santner, who has been… pic.twitter.com/B5e2R3zwy2
— Mumbai Indians (@mipaltan) April 27, 2026
కానీ ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ అదే భుజానికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక అతడి స్థానంలో దక్షిణాప్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడిని 75 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌కే తీసుకున్నారు.
ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్(Mumbai Indians) 7 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -0.736గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
