NZ vs SA : దంచికొట్టిన టామ్ లాథమ్.. మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
అక్లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ (NZ vs SA) ఘన విజయం సాధించింది.
New Zealand win by 8 wickets in 3rd T20 against South Africa
- హాఫ్ సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్
- మూడో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం
- ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి కివీస్
NZ vs SA : అక్లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
SRH : అయ్యో.. కావ్య పాపకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారే..
Tom Latham (63* off 55) steers the team home, sealing the win and a 2–1 series lead 🙌
Watch all the action LIVE and FREE in NZ on TV1 and TVNZ+ #NZvSA
📸 = @PhotosportNZ pic.twitter.com/HheY4beSXs— BLACKCAPS (@BLACKCAPS) March 20, 2026
లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. టామ్ లాథమ్ (63 నాటౌట్ ; 55 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే (39; 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి లాథమ్ తొలి వికెట్కు 10.6 ఓవర్లలోనే 96 పరుగులు జోడించాడు. కాన్వే ఔటైన తరువాత కూడా జోరు కొనసాగించిన లాథమ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సఫారీ బౌలర్లలో లుథో సిపమ్లా, కేశవ్ మహారాజ్లు చెరో వికెట్ తీశారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో న్కోబాని మోకోయెనా (26 నాటౌట్) జార్జ్ లిండే (23) లు రాణించారు. వియాన్ ముల్డర్ డకౌట్ కాగా.. టోనీ డి జోర్జీ (15), కానర్ ఎస్టర్హుయిజెన్ (15), జాసన్ స్మిత్ (10)లు ఘోరంగా విఫలం కావడంతో సౌతాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, కోల్ మెక్కాంచీ, జేమ్స్ నీషమ్ లు తలా ఓ వికెట్ తీశారు.
