ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఇరగదీశాడు. ప్రతి బాల్‌ను బౌండరీకి పంపించాలనే ఆడాడు. తన అద్భుతమైన ప్రదర్శనకు స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
సెంచరీకి చేరువవుతున్న క్రమంలో ఆండ్రీ రస్సెల్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆడిన 34 బంతుల్లో 91 పరుగులు చేసిన పాండ్యా 9సిక్సులు, 6 బౌండరీలు బాదేశాడు. దీంతో ఐపీఎల్ 2019లో 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఘనత సాధించడమే కాక, ఐపీఎల్ మొత్తంలో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు.
ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు:
కేఎల్ రాహుల్ – ఢిల్లీ క్యాపిటల్స్‌పై – 14 బంతుల్లో
యూసఫ్ పఠాన్ – హైదరాబాద్‌పై – 15 బంతుల్లో
సునీల్ నరైన్ – ఆర్సీబీపై – 15 బంతుల్లో
సురేశ్ రైనా – పంజాబ్‌పై – 16 బంతుల్లో
క్రిస్ గేల్ – పూణె వారియర్స్ – 17 బంతుల్లో
హార్దిక్ పాండ్యా – ఈడెన్ గార్డెన్స్ – 17 బంతుల్లో
ఆడం గిల్‌క్రిస్ట్ – ఢిల్లీ క్యాపిటల్స్ – 17 బంతుల్లో
క్రిస్ మోరిస్ – గుజరాత్ లయన్స్ – 17 బంతుల్లో
ఇషాన్ కిషన్ – కోల్‌కతాపై – 17 బంతుల్లో
కీరన్ పొలార్డ్ – కోల్‌కతాపై – 17 బంతుల్లో
సునీల్ నరైన్ – బెంగళూరుపై – 17 బంతుల్లో
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రస్సెల్ 40 బంతుల్లో 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. అతని తర్వాత శుభ్‌మాన్ గిల్ 45 బంతుల్లో 76 పరుగులు చేశాడు.