Asia Cup 2025: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆసియా‌కప్‌ జట్టులోకి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. ఇక విధ్వంసమే..

సెప్టెంబర్ 9-28 తేదీల మధ్య ఆసియా కప్ (Asia Cup 2025) జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు

Asia Cup 2025: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆసియా‌కప్‌ జట్టులోకి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. ఇక విధ్వంసమే..

Asia Cup 2025

Updated On : August 17, 2025 / 7:58 AM IST

Asia Cup 2025: ఆసియాకప్ -2025 (Asia Cup 2025) మెగాటోర్నీకి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. టీ20 జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో ఒకరు బ్యాటుతో, మరొకరు బాల్‌తో ప్రత్యర్థి జట్లకు చమటలు పట్టించేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. (Asia Cup 2025)

Also Read: SA vs AUS: వార్నీ.. ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆసీస్ అద్భుత విజయం.. వీడియో వైరల్

ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అయితే, ఆసియా కప్ కోసం భారత జట్టును ఆగస్టు 19వ తేదీన బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.

ఆసియా‌కప్ మెగా టోర్నీకి భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉంటాడా.. లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముంబై టీ20 లీగ్ తరువాత సూర్యకుమార్ తన స్పోర్ట్స్ హెర్నియా గాయానికి జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం భారత్ కు తిరిగొచ్చి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, అతను పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే అంశంపై అనుమానాలు తలెత్తాయి. దీంతో సూర్యకుమార్ స్థానంలో ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని చర్చలు జరిగాయి. అయితే, ఇప్పుడు ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పండింది. ఆసియాకప్ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ నాయకత్వ బాధ్యతలు వహించేందుకు సిద్ధమయ్యారు.

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సూర్యకుమార్ తన ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేశాడు. టోర్నీ ప్రారంభానికి మూడు వారాల ముందే సూర్య ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఓ క్రికెటర్ శస్త్ర చికిత్స చేయించుకుంటే.. తిరిగి జట్టులోకి రావడానికి సీఓఈలో ఫిట్‌నెస్ పరీక్ష పాసవడం తప్పనిసరి.


మరోవైపు ఆసియా కప్‌లో భారత అగ్రశ్రేణి పేసర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే అవకాశముంది. తాను ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు బుమ్రా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐదు టెస్టుల మ్యాచ్‌లో పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడాడు. దీంతో ఆసియా కప్‌లో బుమ్రా ఆడే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా.. తాను టోర్నీకి అందుబాటులో ఉంటానని బీసీసీఐకి బుమ్రా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆసియాకప్ జట్టులోకి సూర్యకుమార్, బుమ్రా రావడంపై క్లారిటీ రావడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


సెప్టెంబర్ 9-28 తేదీల మధ్య ఆసియా కప్ జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ లీగ్ దశ దాటితే 21న సూపర్-4 మ్యాచ్ లో మరోసారి ఢీకొనే అవకాశం ఉంది.

ఆసియాకప్‌-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, జితేశ్‌ శర్మ