ఐపీఎల్ సాధారణ ప్లేయర్లను సైతం స్టార్ ప్లేయర్లుగా మారడానికి చక్కని వేదిక. ప్లేయర్లతో పాటు స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను సైతం సెలబ్రిటీలను చేసేస్తుంది. ఈ క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ హాట్ బ్యూటీ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. లుక్స్‌తో ఫామస్ అయిపోయిన మళయాళ నటి ప్రియా వారియర్ లాగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే బెంగళూరు అభిమాని అయిన ఈ అమ్మడి వైపు స్క్రీన్‌లన్నీ తిరగడంతో సోషల్ మీడియాలో అంతా ఫిదా అయిపోయింది.
ఇంటర్నెట్‌లో ఎవరీ మిస్టరీ గర్ల్.. అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్ చేసుకోవడంతో దీపిక ఘోష్‌గా నిర్దారణ అయింది. అంతే ఆ యువతికి అమాంతంగా ఫాలోవర్లు పెరిగిపోయారు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
Indian Twitter right now :
“Kudi da pata karo kede pind di aa, kede sheher di aa” #RCBvSRH pic.twitter.com/cf0eX0sAgi
— Sagar (@sagarcasm) May 4, 2019