Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

టీమ్ఇండియా ప్ర‌స్తుతం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉంది.

Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

Rinku Singh Spotted With Shubman Gill Sister Shahneel Gill In Zimbabwe

Shubman Gill Sister Shahneel Gill : టీమ్ఇండియా ప్ర‌స్తుతం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉంది. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో యువ ఆటగాళ్ల‌తో భార‌త్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ గొప్ప‌గా పుంజుకుంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ప్ర‌స్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలిసారి జింబాబ్వేకు వెళ్లిన టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు మ్యాచ్‌ల‌కు మ‌ధ్య దొరికిన విరామంలో అక్క‌డ ఎంజాయ్ చేస్తున్నారు.

గిల్‌తో పాటు అత‌డి సోద‌రి షహనీల్ గిల్ సైతం జింబాబ్వేలోనే ఉంది. భార‌త జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇస్తూ మ్యాచుల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తోంది. కాగా.. ఆమె టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. రెండో టీ20 మ్యాచ్ అనంత‌రం భార‌త జ‌ట్టు జింబాబ్వేలోని ప్ర‌ముఖ జూ, ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది.

Gautam Gambhir : మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడతామంటే కుద‌ర‌దు..? హార్దిక్‌కు గంభీర్ వార్నింగ్..?

ఈ క్ర‌మంలో జిరాఫీతో రింకూ, ష‌హ‌నీల్ సెల్పీ తీసుకున్నారు. వారిద్ద‌రు ఎంతో స‌ర‌దాగా గ‌డిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీంతో రింకూ-ష‌హ‌నీల్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ వెంట‌నే ష‌హ‌నీల్ ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో డిలీజ్ చేసింది.

కాగా.. వీరిద్ద‌రిపై ఇలా వార్త‌లు రావ‌డం తొలిసారి కాదు. గ‌తంలో రింకూ సింగ్ మాల్దీవుల‌కు వెళ్లిన సంద‌ర్భంలో త‌న సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ ఓ ఫోటోను పోస్టు చేశాడు. దీనికి హీరో అంటూ ష‌హ‌నీల్ కామెంట్ చేసింది. అప్ప‌టి నుంచి వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్.. స‌మ్ థింగ్‌.. అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం సెల్పీ వీడియోను పోస్ట్ చేయ‌డం, తిరిగి డిలీజ్ చేయ‌డంతో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లైంది. కాగా.. ప్రేమ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అటు రింకూ, ఇటు ష‌హ‌నీల్ లు ఎక్క‌డా స్పందించ‌లేదు.

Teamindia : యువ‌రాజ్ మెరుపులు, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ఊచ‌కోత‌.. పైన‌ల్‌లోకి భార‌త్‌.. సెమీస్‌లో ఆసీస్ చిత్తు..

ఇదిలా ఉంటే.. రింకూ సింగ్‌, శుభ్‌మ‌న్ గిల్‌లు ఇద్ద‌రూ కూడా మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు త‌రుపున గిల్ ఆడిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి గిల్‌, రింకూలు స్నేహితులుగా మారారు.