Rohit Sharma : ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ప‌లు రికార్డులు బ్రేక్‌

Rohit Sharma breaks record : భార‌త కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిలిచాడు.

Rohit Sharma : ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ప‌లు రికార్డులు బ్రేక్‌

Rohit Sharma breaks record

Rohit Sharma breaks record : భార‌త కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిలిచాడు. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో కోలిన్ అకెర్ మాన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్‌లో సిక్స‌ర్ బాదీ రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. అంతేకాదు ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 54 బంతులు ఆడి 8 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు బాది 61 ప‌రుగులు చేశాడు.

ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ మొద‌టి స్థానానికి చేరుకున్నాడు. ఆ త‌రువాత ఏబీడివిలియ‌ర్స్‌, క్రిస్ గేల్ ఉన్నారు.

రోహిత్ శర్మ – 60 సిక్స‌ర్లు – 2023లో
ఏబీ డివిలియ‌ర్స్ – 58 సిక్స‌ర్లు – 2015లో
క్రిస్ గేల్ – 56 సిక్స‌ర్లు -2019లో
షాహిద్ అఫ్రిది – 48 సిక్స‌ర్లు – 2002 లో

ODI World Cup 2023 : సెమీ ఫైన‌ల్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు బిగ్ షాక్‌..! త‌ప్ప‌ని తిప్ప‌లు..!

ప్ర‌పంచ‌క‌ప్ సింగిల్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన కెప్టెన్ ఎవ‌రంటే..?

ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

రోహిత్ శ‌ర్మ – 24 సిక్స‌ర్లు – 2023 ప్ర‌పంచ‌క‌ప్‌
ఇయాన్ మోర్గాన్ – 22 సిక్స‌ర్లు – 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
ఏబీ డివిలియర్స్ – 21 సిక్స‌ర్లు – 2015 ప్ర‌పంచ‌క‌ప్‌
ఆరోన్ ఫించ్ – 18 సిక్స‌ర్లు – 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
బ్రెండ‌న్ మెకల్లమ్ -17 సిక్స‌ర్లు – 2015 ప్ర‌పంచ‌క‌ప్‌

ODI World Cup 2023 : సెమీ ఫైన‌ల్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు బిగ్ షాక్‌..! త‌ప్ప‌ని తిప్ప‌లు..!

ఓ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా..

ఓ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డుల‌కు ఎక్కాడు. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 61 ప‌రుగులు చేయ‌డంతో మొత్తంగా ఈ ఎడిష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 503 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ రికార్డును అధిగ‌మించాడు.

ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్లు వీరే..

రోహిత్ శర్మ – 503* ప‌రుగులు – 2023
సౌరవ్ గంగూలీ – 465 ప‌రుగులు – 2003
విరాట్ కోహ్లీ – 443 ప‌రుగులు – 2019
అజారుద్దీన్ – 332 ప‌రుగులు – 1992
కపిల్ దేవ్ – 303 ప‌రుగులు – 1983