Sachin Tendulkar : చెప్పిన‌ట్లుగానే అమీర్‌ను క‌లిసిన స‌చిన్‌.. స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చాడు

భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తాను చెప్పిన‌ట్లుగానే జ‌మ్మూకాశ్మీర్‌కు చెందిన పారా క్రికెట‌ర్ అమీర్ హుస్సేన్ ను క‌లిశాడు.

Sachin Tendulkar : చెప్పిన‌ట్లుగానే అమీర్‌ను క‌లిసిన స‌చిన్‌.. స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చాడు

Sachin Tendulkar meets para cricketer Amir Hussain in Kashmir

Sachin meets Amir : భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తాను చెప్పిన‌ట్లుగానే జ‌మ్మూకాశ్మీర్‌కు చెందిన పారా క్రికెట‌ర్ అమీర్ హుస్సేన్ ను క‌లిశాడు. రెండు చేతులు లేక‌పోయినా క్రికెట్ ఆడున్న అమీర్ వీడియోల‌ను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చూసిన స‌చిన్ ఏదో ఒక రోజు అత‌డిని త‌ప్ప‌కుండా క‌లుసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట‌ను తాజాగా నిజం చేశాడు.

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో అమీర్ ఇంటికి వెళ్లాడు. అత‌డిని అభినందించిన అనంత‌రం తాను సంత‌కం చేసిన బ్యాట్‌ను అత‌డికి బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను స్వ‌యంగా స‌చిన్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కు గాయం.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా?

రియ‌ల్ హీరో అమీర్‌ను క‌ల‌వ‌డం త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. ఇంకా ఎంద‌రిలోనూ నువ్వు స్ఫూర్తిని నింపుతూ ఉండాల‌ని అని రాసుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

8 ఏళ్ల వ‌య‌సులోనే..

అమీర్‌కు 8 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో రెండు చేతుల‌ను కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డు కుంగిపోలేదు. పారా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అత‌డు మెడ‌, భుజం సాయంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాలి వేళ్ల మ‌ధ్య బంతిని ఇరికించుకుని బౌలింగ్ సైతం చేయ‌డం విశేషం. 34 ఏళ్ల అమీర్ ప్ర‌స్తుతం జ‌మ్మూక‌శ్మీర్ పారా క్రికెట్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.