Sanju Samson : 18ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాలేదు.. కానీ, చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. నువ్వు తోపు గురూ..
Sanju Samson : తొలి మూడు మ్యాచ్‌లలో సంజూ విఫలమయ్యాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Sanju Samson
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- సెంచరీతో విజయంలో సంజూ శాంసన్ కీలక భూమిక
- ధోనీకి సాధ్యంకాని రికార్డును నెలకొల్పిన సంజూ
Sanju Samson : ఐపీఎల్ -2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం రాత్రి చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో ధోనికి సాధ్యం కాని రికార్డును సంజూ శాంసన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read : IPL 2026: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. హైదరాబాద్ పై పంజాబ్ ఘన విజయం.. భారీ స్కోర్ చేసినా..
శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేశారు. ఇందులో సంజూ శాంసన్ 115తో నాటౌట్‌గా నిలిచాడు. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.
ఐపీఎల్లో ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే, తొలి మూడు మ్యాచ్‌లలో సంజూ విఫలమయ్యాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ రికార్డు నెలకొల్పాడు. 2008 నుండి సీఎస్కే పూర్తిస్థాయి వికెట్ కీపర్ గా ధోనీ ఉన్నారు.. అంటే 18ఏళ్లుగా ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోర్ 84 పరుగులుగా ఉంది. బహుశా ధోనీ ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం కారణంగా మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ, సంజూ శాంసన్ మాత్రం ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో అదరగొట్టి.. రికార్డు క్రియేట్ చేశాడు.
🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨
Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP
— Johns. (@CricCrazyJohns) April 11, 2026
