Sanju samson : సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ధోని క్లబ్లో చేరే సువర్ణావకాశం..
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సంజూ శాంసన్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.
Sanju samson need 296 runs to 5000 runs as wicketkeeper batsman in IPL
Sanju samson : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు సంజూ శాంసన్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని దాటిన రెండో వికెట్ కీపర్‌గా సంజూ రికార్డులకు ఎక్కనున్నాడు.
ఐపీఎల్లో 5వేలు, అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రమే. ఐపీఎల్ ఆరంభ సీజన్ అంటే 2008 నుంచి ఆడుతున్న ధోని ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడాడు. 242 ఇన్నింగ్స్‌ల్లో 38.3 సగటు, 137.4 స్ట్రైక్‌రేటుతో 5439 పరుగులు చేశాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్లో 5వేల పరుగుల కు పైగా సాధించినప్పటికి కూడా అతడు ఐపీఎల్ కెరీర్లో ప్రతి మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా బాధ్యతలను నిర్వర్తించలేదు.
Virat Kohli : ఐపీఎల్లో 9 వేల పరుగుల క్లబ్లో చేరేందుకు విరాట్ కోహ్లీకి ఎన్ని రన్స్ కావాలంటే?
ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే.. 2013లో ఐపీఎల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 177 మ్యాచ్‌లు ఆడాడు. 172 ఇన్నింగ్స్‌ల్లో 30.9 సగటు, 139.1 స్ట్రైక్‌రేటుతో 4704 పరుగులు సాధించాడు. 5వేల పరుగుల క్లబ్లో చేరుకునేందుకు సంజూకు మరో 296 పరుగులు అవసరం.
టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన సంజూ శాంసన్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇదే ఊపులో ఐపీఎల్లో తొలిసారి సీఎస్కే తరుపున బరిలోకి దిగబోతున్న అతడు ఆ జట్టులో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు.
IPL 2026 : ఐపీఎల్ ఆరంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం
సంజూ శాంసన్ 2018 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో అతడు ఆ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అతడి నాయకత్వంలో ఆర్ఆర్ ఐపీఎల్ 2022 ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఇక ఐపీఎల్ 2026 మెగావేలాని కన్నా ముందు సీఎస్కే జట్టుకు ట్రేడింగ్ ద్వారా సంజూ శాంసన్ బదిలీ అయ్యాడు.
